భారత్‌కు మరో డ్రా

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థితో పాయింట్లు పంచుకుంది. మంగళవారం పూల్‌-బి పోరులో సవిత బృందం 1-1తో చైనాతో డ్రా చేసుకుంది. ఆరంభం నుంచి బంతి ఎక్కువసేపు భారత్‌ నియంత్రణలోనే ఉన్నప్పటికీ..

Published : 06 Jul 2022 02:57 IST

మహిళల హాకీ ప్రపంచకప్‌

అమ్‌స్టల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థితో పాయింట్లు పంచుకుంది. మంగళవారం పూల్‌-బి పోరులో సవిత బృందం 1-1తో చైనాతో డ్రా చేసుకుంది. ఆరంభం నుంచి బంతి ఎక్కువసేపు భారత్‌ నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. తొలి గోల్‌ చైనా ఖాతాలో చేరింది. జాంగ్‌ జిన్‌దాన్‌ (26వ నిమిషం) మ్యాచ్‌లో తొలి గోల్‌ చేసింది. అక్కడ నుంచి స్కోరు సమం చేయడానికి భారత్‌ దాడులు పెంచింది. మరికొద్దిసేపట్లో మూడో క్వార్టర్‌ ముగుస్తుందనగా 45వ నిమిషంలో మన జట్టు శ్రమ ఫలించింది. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేస్తూ వందన జట్టుకు గోల్‌ అందించింది. గురువారం జరిగే లీగ్‌ ఆఖరి పోరులో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. ఇప్పటిదాకా రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అన్నే పాయింట్లతో చైనా అగ్రస్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని