కామన్వెల్త్‌ క్రీడలకు హైజంపర్‌ తేజస్విన్‌

ఆటగాడు తేజస్విన్‌ శంకర్‌ను కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) బుధవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

Published : 07 Jul 2022 03:44 IST

దిల్లీ హైకోర్టుకు తెలిపిన ఏఎఫ్‌ఐ

దిల్లీ: హైజంప్‌ ఆటగాడు తేజస్విన్‌ శంకర్‌ను కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) బుధవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. కామన్వెల్త్‌ క్రీడలకు తనను ఎంపిక చేయకపోవడంపై తేజస్విన్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ యశ్వంత్‌వర్మ.. అతని పేరును వెంటనే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)కు పంపాలంటూ ఏఎఫ్‌ఐని ఆదేశించారు. భారత రిలే బృందంలోని ఒక ఆటగాడు అనర్హుడిగా తేలినందున అతని స్థానాన్ని తేజస్విన్‌ను ఇవ్వనున్నట్లు ఏఎఫ్‌ఐ తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని