Published : 07 Jul 2022 03:44 IST

సత్తాచాటిన శశికాంత్‌

గోదావరి టైటాన్స్‌ శుభారంభం

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)లో మార్లిన్‌ గోదావరి టైటాన్స్‌ శుభారంభం చేసింది. బుధవారం వైఎస్సాఆర్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు వీజేడీ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో కోస్టల్‌ రైడర్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గోదావరి టైటాన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కె.వి.శశికాంత్‌ (55 నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. నితీశ్‌కుమార్‌ (25) కూడా రాణించాడు. ఛేదనలో కోస్టల్‌ రైడర్స్‌ 7 ఓవర్లలో 32/2తో ఉన్నప్పుడు వర్షం పడడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో వీజేడీ పద్ధతి ప్రకారం గోదావరి టైటాన్స్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు ఏపీఎల్‌ను ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ప్రారంభించారు. టోర్నీ ట్రోఫీలనూ ఆవిష్కరించారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని