ఫెలిక్స్‌.. పదోసారి

అమెరికా దిగ్గజ స్ప్రింటర్‌ అలీసన్‌ ఫెలిక్స్‌ పదోసారి ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ బరిలో దిగనుంది. ఆమె మిక్స్‌డ్‌ రిలేలో పోటీపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో 18 పతకాలతో..

Updated : 07 Jul 2022 07:20 IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌

ఇండియానాపొలిస్‌: అమెరికా దిగ్గజ స్ప్రింటర్‌ అలీసన్‌ ఫెలిక్స్‌ పదోసారి ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ బరిలో దిగనుంది. ఆమె మిక్స్‌డ్‌ రిలేలో పోటీపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో 18 పతకాలతో.. అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా ఆమె కొనసాగుతోంది. ట్రాక్‌పై ఇదే తనకు చివరి సీజన్‌ అని ప్రకటించిన ఆమెకు ఇప్పుడు మరో పతకాన్ని ఖాతాలో వేసుకునే ఛాన్స్‌ వచ్చింది. గత నెలలో జరిగిన యుఎస్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 400మీ. పరుగులో ఆరో స్థానంలో నిలవడంతో వ్యక్తిగత విభాగాల్లో పోటీపడేందుకు తను అర్హత సాధించలేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ కోసం యుఎస్‌ఏ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విడుదల చేసిన 151 మంది జాబితాలో ఈ 36 ఏళ్ల అథ్లెట్‌కు మిక్స్‌డ్‌ రిలే బృందంలో చోటు దక్కింది. ఈ నెల 15న ఈ ఛాంపియన్‌షిప్స్‌ ఆరంభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని