Updated : 07 Jul 2022 07:21 IST

ఆ బూట్లు ఎంత పని చేశాయ్‌

మొనాకో: గత నెలలో స్పెయిన్‌లో జరిగిన అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వెనిజులా అథ్లెట్‌ యూలిమర్‌ రోజస్‌ లాంగ్‌జంప్‌లో 6.93 మీటర్లు దూకింది. ఆ ప్రదర్శనతో ఈ నెల 15న ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో దిగే అవకాశం దక్కించుకుంది. కానీ తీరా ఇప్పుడు చూస్తే పోటీపడకుండా ఆమెపై ప్రపంచ అథ్లెటిక్స్‌ వేటు వేసింది. అందుకు కారణం లాంగ్‌జంప్‌ సందర్భంగా ఆమె వేసుకున్న బూట్లే. ఒలింపిక్‌ ట్రిపుల్‌ జంప్‌ ఛాంపియన్‌ అయిన ఆమె.. లాంగ్‌జంప్‌ చేసేటప్పుడు ట్రిపుల్‌ జంప్‌కు ఉపయోగించే బూట్లు వేసుకుంది. లాంగ్‌జంప్‌కు అవి ఆమోదయోగ్యమైనవి కాదు. గరిష్ఠంగా 20 మిల్లీమీటర్ల మందం ఉన్న బూట్లను వేసుకుని లాంగ్‌జంప్‌ చేసేందుకు అనుమతిస్తారు. అదే ట్రిపుల్‌ జంప్‌ విషయానికి వచ్చేసరికి ఆ మందం 25 మిల్లీమీటర్లుగా ఉంది. ఇప్పుడీ కారణంతో ఆమె లాంగ్‌జంప్‌ పోటీలకు దూరం కానుంది. అయితే ట్రిపుల్‌ జంప్‌లో మాత్రం ఈ ఛాంపియన్‌ తలపడుతుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts