నేరుగా క్వార్టర్స్‌ చేరేలా

మహిళల హాకీ ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న భారత జట్టు జూలు విదిల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంగ్లాండ్‌, చైనాలతో మ్యాచ్‌లను డ్రాగా ముగించిన సవిత సేన..

Published : 07 Jul 2022 03:53 IST

విజయంపై కన్నేసిన భారత్‌
హాకీ ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్‌తో ఢీ

అమ్‌స్టల్‌వీన్‌: మహిళల హాకీ ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న భారత జట్టు జూలు విదిల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంగ్లాండ్‌, చైనాలతో మ్యాచ్‌లను డ్రాగా ముగించిన సవిత సేన.. నేరుగా క్వార్టర్స్‌లో బెర్తు దక్కించుకోవాలంటే గురువారం న్యూజిలాండ్‌పై గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో మన జట్టు అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయి ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పూల్‌- బి లో భారత్‌ రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (4), చైనా (2) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్స్‌ చేరుతుంది. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్న జట్లు.. ముందంజ వేయాలంటే క్రాస్‌ఓవర్స్‌లో ఇతర పూల్‌లోని జట్లతో తలపడాలి. ఇప్పుడు పూల్‌లో తన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ గెలిచి.. మరోవైపు ఇంగ్లాండ్‌తో చైనా ఓడిపోయినా లేదా డ్రా చేసుకున్నా మన జట్టు అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని