CWG 2022: హాకీ సెమీస్‌లో భారత్‌

కామన్వెల్త్‌ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌ (పూల్‌-ఎ)లో భారత్‌ 3-2తో కెనడాపై విజయం సాధించింది. సలీమా టెటె (3వ

Updated : 04 Aug 2022 03:32 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌ (పూల్‌-ఎ)లో భారత్‌ 3-2తో కెనడాపై విజయం సాధించింది. సలీమా టెటె (3వ నిమిషం), నవ్‌నీత్‌ కౌర్‌ (22వ) గోల్స్‌తో 22వ నిమిషం వరకు భారత్‌ మ్యాచ్‌లో పూర్తి నియంత్రణతో ఉంది. కానీ ప్రపంచ 15వ ర్యాంకు జట్టు కెనడా గట్టిగా ప్రతిఘటించింది. బ్రైనె స్టెయిర్స్‌ (23వ), హనా హాన్‌ (39వ) గోల్స్‌తో స్కోరు సమం చేసింది. సెమీస్‌ చేరడానికి ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సరిపోయే పరిస్థితి కెనడాది కాగా.. పునియా నేతృత్వంలోని భారత్‌కు గెలుపు తప్పనసరి. ఈ నేపథ్యంలో 2-2 నుంచి పోరు రసవత్తరంగా సాగింది. పుంజుకున్న భారత్‌ 51వ నిమిషంలో లాల్రెమ్‌సియామి గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. గుర్జీత్‌ కౌర్‌ షాట్‌ను కెనడా డిఫెన్స్‌ అడ్డుకోగా.. వెనక్కి వచ్చిన బంతిని లాల్రెమ్‌సియామి గోల్‌లోకి నెట్టింది. ఆధిక్యాన్ని భారత్‌ చివరి వరకూ నిలబెట్టుకుంది. మరోవైపు పురుషుల విభాగం మ్యాచ్‌ (పూల్‌-బి)లో భారత్‌ 8-0తో కెనడాపై ఘనవిజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ (7వ, 54వ), ఆకాశ్‌దీప్‌ (38వ, 60వ) చెరో రెండు గోల్స్‌ కొట్టగా.. అమిత్‌ (10వ), లలిత్‌ (20వ), గుర్జంత్‌ సింగ్‌ (27వ), మన్‌దీప్‌ సింగ్‌ (58వ) తలో గోల్‌ సాధించారు. ఈ విజయంతో భారత్‌ పూల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. భారత్‌ తన చివరి పూల్‌ మ్యాచ్‌లో గురువారం వేల్స్‌ను ఢీకొంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని