CWC 2022: రెజ్లింగ్‌ స్టేడియంలో కలకలం

కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ పోటీలు నిర్వహిస్తున్న స్టేడియంలో కలకలం రేగింది. పై నుంచి ఆడియో పరికరాలు కింద పడి గందరగోళ వాతావరణం నెలకొనడంతో రెండు గంటల పాటు పోటీలు ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రెజ్లింగ్‌ పోటీలు శుక్రవారం ఉదయమే ఆరంభం కాగా.. కాసేపటికే ఆడియో పరికరాలు

Updated : 06 Aug 2022 09:56 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ పోటీలు నిర్వహిస్తున్న స్టేడియంలో కలకలం రేగింది. పై నుంచి ఆడియో పరికరాలు కింద పడి గందరగోళ వాతావరణం నెలకొనడంతో రెండు గంటల పాటు పోటీలు ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రెజ్లింగ్‌ పోటీలు శుక్రవారం ఉదయమే ఆరంభం కాగా.. కాసేపటికే ఆడియో పరికరాలు పైనుంచి కిందపడడంతో స్టేడియంలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే నిర్వాహకులు అధికారులతో పాటు బౌట్‌లు చూసేందుకు వచ్చిన అభిమానులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. తర్వాత పోటీలు పునఃప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని