Big Bash League: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎర!

ఐపీఎల్‌ తర్వాత ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ల్లో ఎక్కువ ఆదరణ ఉన్నది క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)కే. భారత్‌ మినహా వివిధ దేశాల స్టార్‌ క్రికెటర్లూ ఈ లీగ్‌లో సందడి చేస్తారు. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్ల సభ్యుల్లో దాదాపు అందరూ ఇందులో పాల్గొంటారు. దేశవాళీ స్టార్లూ ఆడతారు. అయితే లీగ్‌కు ఆకర్షణగా

Updated : 06 Aug 2022 05:37 IST

బిగ్‌బాష్‌కు యూఏఈ లీగ్‌తో ముప్పు

సిడ్నీ: ఐపీఎల్‌ తర్వాత ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ల్లో ఎక్కువ ఆదరణ ఉన్నది క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)కే. భారత్‌ మినహా వివిధ దేశాల స్టార్‌ క్రికెటర్లూ ఈ లీగ్‌లో సందడి చేస్తారు. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్ల సభ్యుల్లో దాదాపు అందరూ ఇందులో పాల్గొంటారు. దేశవాళీ స్టార్లూ ఆడతారు. అయితే లీగ్‌కు ఆకర్షణగా ఉన్న ఆస్ట్రేలియా స్టార్లను తమ వైపు తిప్పుకొనేందుకు యూఏఈలో జరగనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ (ఐఎల్‌టీ20) నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆసీస్‌ ఆటగాళ్లు వేరే క్రికెట్‌ లీగ్‌ల్లో ఆడడం కొత్తేమీ కాదు కానీ.. బిగ్‌ బాష్‌ జరిగే తేదీల్లోనే ఐఎల్‌టీ20 తొలి సీజన్‌ నిర్వహించనుండడమే సమస్య. బీబీఎల్‌ కొత్త సీజన్‌ డిసెంబరు 13 నుంచి ఫిబ్రవరి 6 వరకు కొనసాగనుండగా.. ఐఎల్‌టీ20 తొలి సీజన్‌ను జనవరి 6-ఫిబ్రవరి 12 మధ్య నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఒక్కొక్కరికి 7 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.3.84 కోట్లు) చొప్పున చెల్లిస్తామని ఆశ చూపి 15 మంది కంగారూ ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకోవడానికి ఐఎల్‌టీ20 లీగ్‌ ఫ్రాంఛైజీలు ప్రయత్నిస్తున్నాయట. ఆసీస్‌ స్టార్లు ఈ డబ్బులకు ఆశపడి ఆ లీగ్‌ వైపు మళ్లితే.. బీబీఎల్‌ కళ తప్పడం ఖాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని