Sports news: శాఫ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ భారత్‌ సొంతం

శాఫ్‌ అండర్‌-20 ఫుట్‌బాల్‌ టైటిల్‌ను ఆతిథ్య భారత్‌ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అదనపు సమయంలో భారత్‌ 5-2 గోల్స్‌తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో సగం ఆట అయ్యే సరికి భారత్‌-బంగ్లా చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. నిర్ణీత సమయం పూర్తయ్యే సమయానికి రెండు జట్లు 2-2తో మళ్లీ సమమయ్యాయి.

Updated : 06 Aug 2022 05:35 IST

భువనేశ్వర్‌: శాఫ్‌ అండర్‌-20 ఫుట్‌బాల్‌ టైటిల్‌ను ఆతిథ్య భారత్‌ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అదనపు సమయంలో భారత్‌ 5-2 గోల్స్‌తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో సగం ఆట అయ్యే సరికి భారత్‌-బంగ్లా చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. నిర్ణీత సమయం పూర్తయ్యే సమయానికి రెండు జట్లు 2-2తో మళ్లీ సమమయ్యాయి. అయితే అదనపు సమయంలో గుర్‌కీరత్‌ (94వ, 99వ) రెండు, హిమాంశు (92వ) ఒక గోల్‌ కొట్టి భారత్‌ను విజయపథంలో నడిపించారు. ఈ మ్యాచ్‌లో గుర్‌కీరత్‌ ఒక్కడే నాలుగు గోల్స్‌ చేయడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని