Updated : 06 Aug 2022 05:35 IST

World championship: రైతుబిడ్డ.. రికార్డు డబుల్‌

అండర్‌-20 అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు సొంతం

కాలి (కాలిఫోర్నియా): అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రూపల్‌ చౌదరి రికార్డు సృష్టించింది. ఇప్పటికే 4×400 మీటర్ల రిలే పరుగులో రజతం గెలిచిన జట్టులో సభ్యురాలైన రూపల్‌.. తాజాగా 400 మీటర్ల వ్యక్తిగత పరుగులో కాంస్యం దక్కించుకుంది. ఈ రేసును ఆమె 51.85 సెకన్లలో ముగించి.. యెమి మేరీ (51.50 సె-గ్రేట్‌ బ్రిటన్‌), దమరిస్‌ ముతుంగ (51.71 సె-కెన్యా)ల తర్వాతి స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో రూపల్‌ 52.27 సెకన్లతో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసింది. ఫైనల్లో అదే ప్రదర్శనను పునరావృతం చేస్తే ఆమె స్వర్ణం గెలిచేది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా, షాపూర్‌ జైన్‌పూర్‌ అనే పల్లెటూరికి చెందిన 17 ఏళ్ల రూపల్‌.. సాధారణ రైతు కుటుంబం నుంచి అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టి ప్రపంచ స్థాయికి ఎదిగింది. 2018లో హిమదాస్‌ స్వర్ణం గెలిచాక అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ 400 మీ. పరుగులో పతకం నెగ్గిన క్రీడాకారిణి రూపలే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts