CWG: సెమీఫైనల్లో శ్రీజ

కామన్వెల్త్‌ క్రీడల్లో టీటీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ దూసుకెళ్తోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఆమె..మహిళల సింగిల్స్‌లో సెమీస్‌ చేరింది. హోరాహోరీగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో శ్రీజ-ఆచంట శరత్‌కమల్‌ 3-2తో ఫిచ్‌ఫోర్డ్‌-హో తిన్‌ (ఇంగ్లాండ్‌)పై విజయం సాధించారు. మహిళల

Updated : 06 Aug 2022 05:33 IST

కామన్వెల్త్‌ క్రీడల్లో టీటీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ దూసుకెళ్తోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఆమె..మహిళల సింగిల్స్‌లో సెమీస్‌ చేరింది. హోరాహోరీగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో శ్రీజ-ఆచంట శరత్‌కమల్‌ 3-2తో ఫిచ్‌ఫోర్డ్‌-హో తిన్‌ (ఇంగ్లాండ్‌)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో శ్రీజ 4-3తో జాంగ్‌ (కెనడా)పై గెలిచింది. మనిక బత్రా మహిళల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓడిపోయింది. సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 0-4తో మి యింగ్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో మనిక-సత్యన్‌ 2-3తో కరెన్‌-చూంగ్‌ (మలేసియా) చేతిలో తలొంచారు. పురుషుల డబుల్స్‌లో శరత్‌కమల్‌-జ్ఞానశేఖరన్‌ క్వార్టర్స్‌ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో శరత్‌ జంట 3-0తో రహీమ్‌-అహ్మద్‌ (బంగ్లాదేశ్‌) జోడీని చిత్తు చేసింది. ఇంకో ప్రిక్వార్టర్స్‌లో హర్మీత్‌దేశాయ్‌-సనీల్‌శెట్టి 3-1తో చాంబర్స్‌-యాన్‌ జిన్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించారు.

జ్యోతి విఫలం: మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి విఫలమైంది. హీట్‌-2లో 13.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన జ్యోతి నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో సెమీస్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. హీట్‌లో టాప్‌-3 అథ్లెట్లు మాత్రమే ముందంజ వేస్తారు. పురుషుల 4×400 మీటర్ల రిలే రేసులో భారత్‌ ఫైనల్‌ చేరింది. మహ్మద్‌ అనాస్‌, నిర్మల్‌, అజ్మల్‌, అమోజ్‌లతో కూడిన భారత జట్టు హీట్‌-2లో 3 నిమిషాల 6.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్‌బౌల్స్‌లో భారత పురుషుల జట్టు ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో భారత్‌ (సునీల్‌, నవ్‌నీత్‌, చందన్‌, దినేశ్‌) 13-12తో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌: బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-10, 21-9తో కొబుగాబె (ఉగాండా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో 21-9, 21-12తో అభివిక్రమ (శ్రీలంక)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-త్రీసా జాలీ క్వార్టర్స్‌లో ప్రవేశించారు. గాయత్రి జంట 21-2, 21-4తో సాంగ్‌ జెమీమా-మంగ్రా (మారిషస్‌) జోడీని ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని