CWG 2022: ఫైనల్లో నిఖత్‌

తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌జరీన్‌ కామన్వెల్త్‌ క్రీడల బాక్సింగ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 48-50 కేజీల విభాగం సెమీస్‌లో నిఖత్‌ 5-0తో అల్ఫియా (ఇంగ్లాండ్‌)ను చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేసుకుంది. నీతు (45-48 కేజీలు) కూడా తుది సమరానికి అర్హత సాధించింది.

Updated : 07 Aug 2022 05:32 IST

బర్మింగ్‌హామ్‌: తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌జరీన్‌ కామన్వెల్త్‌ క్రీడల బాక్సింగ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 48-50 కేజీల విభాగం సెమీస్‌లో నిఖత్‌ 5-0తో అల్ఫియా (ఇంగ్లాండ్‌)ను చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేసుకుంది. నీతు (45-48 కేజీలు) కూడా తుది సమరానికి అర్హత సాధించింది. సెమీస్‌లో నీతు.. ప్రియాంక (కెనడా)ను నాకౌట్‌ చేసింది. పురుషుల విభాగంలో అమిత్‌ ఫంగాల్‌ పసిడి పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో అమిత్‌ (48-51 కేజీలు) 5-0తో ప్యాట్రిక్‌ (జాంబియా)ను ఓడించాడు.

సెమీస్‌లో సింధు, శ్రీకాంత్‌: బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో సింధు, శ్రీకాంత్‌ సెమీస్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సింధు 2-1తో జిన్‌వీయ్‌ (మలేసియా) గెలవగా, ఆకర్షి 0-2తో క్రిస్టీ (స్కాట్లాండ్‌) చేతిలో ఓడింది. పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 2-0తో టోబీ (ఇంగ్లాండ్‌)పై, లక్ష్యసేన్‌ 2-0తో జులియన్‌ (మారిషస్‌)పై నెగ్గారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని