CWG 2022: శ్రీజ-శరత్‌ జోడీకి పతకం ఖాయం

తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆచంట శరత్‌కమల్‌తో కలిసి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. నువ్వానేనా అన్నట్లు సాగిన సెమీస్‌ పోరులో శ్రీజ-శరత్‌ 3-2తో నికోలాస్‌-మిన్‌యుంగ్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. మహిళల

Updated : 07 Aug 2022 05:31 IST

బర్మింగ్‌హామ్‌: తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆచంట శరత్‌కమల్‌తో కలిసి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. నువ్వానేనా అన్నట్లు సాగిన సెమీస్‌ పోరులో శ్రీజ-శరత్‌ 3-2తో నికోలాస్‌-మిన్‌యుంగ్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో శ్రీజ పోరాటం ముగిసింది. సెమీస్‌లో శ్రీజ 3-4తో మూడుసార్లు ఒలింపిక్‌ పతక విజేత తియాన్‌వీయ్‌ (సింగపూర్‌) చేతిలో ఓడింది. ఇక ఆమె కాంస్యం కోసం పోరాడనుంది. ఆదివారం యాంగ్‌జీ (ఆస్ట్రేలియా)తో శ్రీజ తలపడనుంది. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో శ్రీజ-రీత్‌ టెన్నిసన్‌ 1-3తో వాంగ్‌-జింగ్‌యీ (సింగపూర్‌) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల సింగిల్స్‌లో శరత్‌కమల్‌, సత్యన్‌ సెమీఫైనల్‌ చేరారు. శరత్‌ 4-0తో యాంగ్‌ ఐజాక్‌ (సింగపూర్‌)పై గెలవగా, సత్యన్‌ 4-2తో సామ్‌ వాకర్‌ (ఇంగ్లాండ్‌)ను ఓడించాడు. పురుషుల డబుల్స్‌లో శరత్‌-సత్యన్‌ ఫైనల్‌ చేరారు. గత కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగు పతకాలు సాధించిన స్టార్‌ పెడ్లర్‌ మనిక బత్రాకు ఈసారి రిక్తహస్తమే మిగిలింది. ఇప్పటికే టీమ్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, సింగిల్స్‌లో ఓడిన మనిక.. మహిళల డబుల్స్‌లోనూ పరాజయం చవిచూసింది. మనిక-దివ్య 1-3తో చార్లొట్‌-హార్సీ (వేల్స్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని