Chess Olympiad: అమెరికాకు భారత్‌-2 షాక్‌

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌-2 జట్టు సంచలన విజయం సాధించింది. ఎనిమిదో రౌండ్లో 3-1తో బలమైన అమెరికాకు షాకిచ్చింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గుకేశ్‌ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అగ్రశ్రేణి ఆటగాడు కరువానాకు అతడు షాకిచ్చాడు మరో గేమ్‌లో తనకన్నా

Updated : 07 Aug 2022 05:29 IST

చెస్‌ ఒలింపియాడ్‌

మహాబలిపురం: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌-2 జట్టు సంచలన విజయం సాధించింది. ఎనిమిదో రౌండ్లో 3-1తో బలమైన అమెరికాకు షాకిచ్చింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గుకేశ్‌ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అగ్రశ్రేణి ఆటగాడు కరువానాకు అతడు షాకిచ్చాడు మరో గేమ్‌లో తనకన్నా మెరుగైన రేటింగ్‌ ఉన్న పెరెజ్‌ను రౌనక్‌ సద్వాని ఓడించాడు. అరోనియన్‌తో గేమ్‌ను నిహాల్‌ సరీన్‌, వెస్లీతో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించారు. భారత్‌-2 రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో భారత్‌-1 (హరికృష్ణ, విదిత్‌, అర్జున్‌, నారాయనన్‌) జట్టు 1.5-2.5తో అర్మేనియా చేతిలో ఓడింది. భారత్‌-3 జట్టు 1-3తో పెరూ చేతిలో కంగుతింది. మహిళల విభాగంలో హంపి, హారిక, వైశాలి, తానియాలతో కూడిన భారత్‌-1 అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్లో ఉక్రెయిన్‌తో మ్యాచ్‌ను ఆ జట్టు 2-2తో డ్రాగా ముగించింది. భారత్‌-2 జట్టు 3.5-0.5తో క్రొయేషియాపై నెగ్గగా.. భారత్‌-3తో 1-3తో పోలెండ్‌ చేతిలో పరాజయంపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని