Chess olympiad: ఫిడే ఉపాధ్యక్షుడిగా విషీ

ఆటగాడిగా చదరంగ ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన విశ్వనాథన్‌ ఆనంద్‌ ఇప్పుడు ఆట పాలకుడిగా మారాడు. ఆదివారం అతడు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

Updated : 08 Aug 2022 04:09 IST

చెన్నై: ఆటగాడిగా చదరంగ ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన విశ్వనాథన్‌ ఆనంద్‌ ఇప్పుడు ఆట పాలకుడిగా మారాడు. ఆదివారం అతడు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అక్కాడీ ద్వొర్కోవిచ్‌ మళ్లీ గెలిచాడు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆనంద్‌.. ద్వొర్కోవిచ్‌ ప్యానెల్‌లో సభ్యుడు. ద్వొర్కోవిచ్‌కు 157 ఓట్లు రాగా.. అతడి ప్రత్యర్థి ఆండ్రీ బారిష్పోలెట్స్‌కు 16 ఓట్లే వచ్చాయి. ఒలింపియాడ్‌ సందర్భంగా ఫిడే ఎన్నికలు నిర్వహించారు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో టైటిళ్లు గెలిచిన ఆనంద్‌.. ఇటీవల తాను ఆడే టోర్నమెంట్ల సంఖ్యను బాగా తగ్గించుకున్నాడు. కోచింగ్‌పై దృష్టిపెట్టాడు.

భారత 75వ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణవ్‌: వి.ప్రణవ్‌ భారత 75వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. చెన్నైకి చెందిన ఈ 15 ఏళ్ల ఆటగాడు తాజాగా లింపెడియా చెస్‌ ఓపెన్‌లో చివరి గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ను సంపాదించాడు. 2021 సెర్బియా ఓపెన్లో తొలి జీఎం నార్మ్‌ దక్కించుకున్న ప్రణవ్‌.. ఈ జూన్‌లో బుడాపెస్ట్‌లో జరిగిన వెజెర్క్‌జో టోర్నీలో రెండో నార్మ్‌ సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని