Cricket news: కోహ్లి, రాహుల్‌ పునరాగమనం

వెస్టిండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జట్టులో పునరాగమనం చేశాడు. హెర్నియా సర్జరీ, ఆ తర్వాత కరోనా కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ కూడా వచ్చేశాడు. ఆసియా కప్‌ టీ20 టోర్నీలో పోటీపడే భారత జట్టులో ఈ ఇద్దరు

Updated : 09 Aug 2022 04:23 IST

ఆసియాకప్‌కు భారత్‌ జట్టు

దిల్లీ: వెస్టిండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జట్టులో పునరాగమనం చేశాడు. హెర్నియా సర్జరీ, ఆ తర్వాత కరోనా కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ కూడా వచ్చేశాడు. ఆసియా కప్‌ టీ20 టోర్నీలో పోటీపడే భారత జట్టులో ఈ ఇద్దరు ఎంపికయ్యారు. రోహిత్‌ నాయకత్వంలోని జట్టుకు రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌. సోమవారం సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. వెన్ను గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్‌ పటేల్‌ పేరునూ జట్టు ఎంపికలో పరిగణించలేదని బీసీసీఐ తెలిపింది. శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న దీపక్‌ చాహర్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఈ అయిదుగురితో పాటు.. ఆసియా కప్‌నకు ఎంపికైన పదిహేను మంది సభ్యులను.. కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ప్రపంచకప్‌ కోర్‌ బృందంగా గుర్తించారు. ప్రపంచకప్‌ కోసం జట్టును వీరి నుంచే ఎంపికచేసే అవకాశముంది. ఈనెల 27న యూఏఈ వేదికగా ఆసియాకప్‌ ఆరంభంకానుంది.

భారత్‌ జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్‌, చాహల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ఖాన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని