SouthAfrica: కారు ప్రమాదంలో కొయిర్జెన్‌ మృతి

దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ అంతర్జాతీయ అంపైర్‌ రూడీ కొయిర్జెన్‌ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కొయిర్జెన్‌ వయసు 73 ఏళ్లు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

Updated : 10 Aug 2022 03:12 IST

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ అంతర్జాతీయ అంపైర్‌ రూడీ కొయిర్జెన్‌ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కొయిర్జెన్‌ వయసు 73 ఏళ్లు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. గోల్ఫ్‌ ఆడి స్వస్థలం కేప్‌టౌన్‌కు తిరిగి వస్తుండగా రూడీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో కొయిర్జెన్‌తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 1981లో అంపైర్‌గా మారిన రూడీ.. 1992లో దక్షిణాఫ్రికాలో భారత్‌ చరిత్రాత్మక పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2002 నుంచి ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో ఉన్న కొయిర్జెన్‌.. 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ20లకు అంపైర్‌గా వ్యవరించాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో టీవీ అంపైర్‌గా పని చేసిన కొయిర్జెన్‌ మొత్తం మూడు వన్డే ప్రపంచకప్‌లలో సేవలందించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని