రెండో స్థానంలో సూర్య

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్‌ నుంచి అత్యుత్తమ ర్యాంకు అతడిదే. శ్రేయస్‌ అయ్యర్‌ ఆరు ర్యాంకులు మెరుగుపరుచుకుని 19వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో చివరి

Published : 11 Aug 2022 04:10 IST

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్‌ నుంచి అత్యుత్తమ ర్యాంకు అతడిదే. శ్రేయస్‌ అయ్యర్‌ ఆరు ర్యాంకులు మెరుగుపరుచుకుని 19వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20లో శ్రేయస్‌ 40 బంతుల్లో 64 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా మెరుగయ్యారు. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టిన 21 ఏళ్ల బిష్ణోయ్‌.. 50 స్థానాలు ఎగబాకి 44వ స్థానం సాధించాడు. చివరి టీ20లో మూడు వికెట్లు చేజిక్కించుకున్న కుల్‌దీప్‌ 58 స్థానాలు మెరుగుపర్చుకుని 87వ స్థానంలో నిలిచాడు. సీనియర్‌ పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఒక స్థానం కోల్పోయి 9వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ నబి నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts