కోహ్లి బయటపడతాడు

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ నాణ్యమైన ఆటగాడని, దీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఫామ్‌ లేమి నుంచి బయటపడేందుకు కావాల్సినవన్నీ తన దగ్గర ఉన్నాయని శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేళ జయవర్దనె అన్నాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే సిరీస్‌

Published : 11 Aug 2022 04:10 IST

దుబాయి: భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ నాణ్యమైన ఆటగాడని, దీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఫామ్‌ లేమి నుంచి బయటపడేందుకు కావాల్సినవన్నీ తన దగ్గర ఉన్నాయని శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేళ జయవర్దనె అన్నాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే సిరీస్‌ నుంచి విరామం తీసుకున్న కోహ్లి.. యూఏఈలో ఈ నెల 27న ఆరంభమయ్యే ఆసియా కప్‌ కోసం తిరిగి జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతను 2019 నవంబర్‌ నుంచి ఒక్క సెంచరీ కొట్టలేదు. ‘‘ప్రస్తుతం కోహ్లి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం. అతనో నాణ్యమైన ఆటగాడు. ఫామ్‌ లేమి నుంచి బయటకు వచ్చేందుకు అతని దగ్గర ఉపకరణాలు ఉన్నాయని నమ్ముతున్నా. గతంలోనూ అతను ఇలాంటి దశ నుంచి బయటపట్టాడు. ఇప్పుడూ అదే చేస్తాడని ఆశిస్తున్నా. ఫామ్‌ తాత్కాలికం కానీ క్లాస్‌ శాశ్వతం’’ అని జయవర్దనె తెలిపాడు. మరోవైపు హెర్నియా శస్త్రచికిత్స, కరోనా నుంచి కోలుకుని ఆసియా కప్‌ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా తిరిగొస్తున్న కేఎల్‌ రాహుల్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం సమస్యగా మారుతుందని మహేల అభిప్రాయపడ్డాడు. ‘‘రాహుల్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం భారత్‌కు ఇబ్బందే. ఐపీఎల్‌ తర్వాత అతనెక్కువగా మ్యాచ్‌లాడలేదు. అతను కాస్త ఆటలో సమయం గడిపితే తిరిగి ఆత్మవిశ్వాసం పొందుతాడు. అది అతనితో పాటు జట్టుకూ ఉపయోగపడుతుంది. ఒకవేళ రాహుల్‌ లయ అందుకోకపోతే రోహిత్‌కు జతగా పంత్‌ను ఓపెనింగ్‌కు పంపాలి. దేశవాళీల్లోనూ పంత్‌ ఓపెనర్‌గా ఆడనప్పటికీ అతనికా సామర్థ్యం ఉంది. ఏ స్థానంలోనైనా అతని ఆట మారదు’’ అని అతను పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు