బంగ్లా చేతిలో జింబాబ్వే చిత్తు

బంగ్లాదేశ్‌కు కాస్త ఊరట. తొలి రెండు వన్డేల్లో ఓడి జింబాబ్వేకు సిరీస్‌ కోల్పోయిన ఆ జట్టు చివరిదైన మూడో మ్యాచ్‌లో 105 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బుధవారం జరిగిన పోరులో మొదట బంగ్లాదేశ్‌ 9 వికెట్ల

Published : 11 Aug 2022 04:10 IST

హరారె: బంగ్లాదేశ్‌కు కాస్త ఊరట. తొలి రెండు వన్డేల్లో ఓడి జింబాబ్వేకు సిరీస్‌ కోల్పోయిన ఆ జట్టు చివరిదైన మూడో మ్యాచ్‌లో 105 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బుధవారం జరిగిన పోరులో మొదట బంగ్లాదేశ్‌ 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అఫిఫ్‌ హుస్సేన్‌ (85), అనాముల్‌ హక్‌ (76) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే తడబడింది. ముస్తాఫిజుర్‌ (4/17), తైజుల్‌ ఇస్లామ్‌ (2/34), ఎబాదత్‌ హుస్సేన్‌ (2/38) ధాటికి 32.2 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో జింబాబ్వే 83 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకుంది. రిచర్డ్‌ ఎంగర్వ (34 నాటౌట్‌), విక్టర్‌ న్యాచ్‌ (26) పదో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. సిరీస్‌ 2-1తో జింబాబ్వే సొంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని