డిసెంబర్‌ 6 నుంచి ఎల్‌పీఎల్‌

శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ లంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌) మూడో సీజన్‌ డిసెంబర్‌ 6 నుంచి 23 వరకు జరుగుతుంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి 21 వరకు ఈ లీగ్‌ను నిర్వహించాల్సింది.

Published : 11 Aug 2022 04:10 IST

కొలంబో: శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ లంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌) మూడో సీజన్‌ డిసెంబర్‌ 6 నుంచి 23 వరకు జరుగుతుంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి 21 వరకు ఈ లీగ్‌ను నిర్వహించాల్సింది. కానీ ఈ ద్వీప దేశంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. ‘‘డిసెంబర్‌ 6 నుంచి 23 వరకు ఎల్‌పీఎల్‌ జరుగుతుందని చెప్పడానికి ఆనందిస్తున్నా’’ అని ఎల్‌పీఎల్‌ టోర్నీ నిర్వాహకుడు సమంత దోడన్వెలా పేర్కొన్నాడు. ఈ లీగ్‌ ప్రమోటర్‌ అయిన ఐపీజీ కూడా దీన్ని ధ్రువీకరించింది. లీగ్‌లో ఆటగాళ్లను తిరిగి జట్లలోకి తీసుకునే విషయంపై నిర్వహకులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా ఆటగాళ్లను తీసుకోవాలా? లేదా అందుబాటులో ఉన్న వాళ్లను అలాగే ఉంచి, ఖాళీ స్థానాలను ఇతరులతో భర్తీ చేయాలా? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితిలోనూ జులైలో సుదీర్ఘంగా సాగిన ఆస్ట్రేలియా సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్‌తోనూ టెస్టులాడింది. కానీ ఈ నెల 27న ఆరంభం కావాల్సిన ఆసియా కప్‌ను మాత్రం నిర్వహించలేమని ఆ దేశం స్పష్టం చేయడంతో ఆ టోర్నీని యూఏఈకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని