టాటా చెస్‌లో మహిళల ఈవెంట్‌

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో తొలిసారి మహిళల ఈవెంట్‌ జరగనుంది. కోల్‌కతాలో నవంబరు 29 నుంచి డిసెంబరు 4 వరకు పోటీలు నిర్వహించనున్నారు. గతంలో మూడుసార్లు టాటా చెస్‌ టోర్నీ జరింది. ఈసారి టోర్నీతో మహిళల

Published : 11 Aug 2022 04:10 IST

నగదు బహుమతి సమానం

చెన్నై: టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో తొలిసారి మహిళల ఈవెంట్‌ జరగనుంది. కోల్‌కతాలో నవంబరు 29 నుంచి డిసెంబరు 4 వరకు పోటీలు నిర్వహించనున్నారు. గతంలో మూడుసార్లు టాటా చెస్‌ టోర్నీ జరింది. ఈసారి టోర్నీతో మహిళల విభాగాన్ని ప్రవేశపెడుతున్నారు. హంపి, హారిక వంటి స్టార్లు ఆడనున్నారు. ఓపెన్‌, మహిళల ఈవెంట్లో నగదు బహుమతి సమానంగా ఉంటుంది. భారత స్టార్లతో పాటు మహిళా గ్రాండ్‌మాస్టర్లు అనా ముజిచుక్‌, మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), జాగింగె (జార్జియా), కష్లిన్‌స్కయా (పోలెండ్‌) తదితరులు టోర్నీలో తాము ఆడే విషయాన్ని ధ్రువీకరించినట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఓపెన్‌ విభాగంలోలాగే మహిళల విభాగంలో కూడా ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ పోటీలు ఉంటాయి. అంతర్జాతీయ అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు.. అగ్రశ్రేణి భారత పురుష, మహిళా గ్రాండ్‌మాస్టర్లు టాటా చెస్‌ టోర్నీలో పోటీపడతారని భావిస్తున్నారు. భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ టోర్నీ ప్రచారకర్తగా, సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. టాటా చెస్‌లో మహిళల విభాగం చేర్చడం, సమాన బహుమతిని ఇవ్వడం సంతోషాన్నిస్తోందని భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి తానియా సచ్‌దేవ్‌ వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని