తొలి టీ20లో విండీస్‌పై కివీస్‌ విజయం

వెస్టిండీస్‌తో తొలి టీ20లో న్యూజిలాండ్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (47), కాన్వే (43), నీషమ్‌ (33 నాటౌట్‌) చెలరేగడంతో మొదట న్యూజిలాండ్‌ 5 వికెట్ల

Published : 12 Aug 2022 03:43 IST

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టీ20లో న్యూజిలాండ్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (47), కాన్వే (43), నీషమ్‌ (33 నాటౌట్‌) చెలరేగడంతో మొదట న్యూజిలాండ్‌ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఒడియన్‌ స్మిత్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో వెస్టిండీస్‌ 7 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేయగలిగింది. బ్రూక్స్‌ (42) టాప్‌ స్కోరర్‌. రొమారియో షెపర్డ్‌ (31 నాటౌట్‌), ఒడియన్‌ స్మిత్‌ (27 నాటౌట్‌), హోల్డర్‌ (25) రాణించారు. శాంట్నర్‌ (3/19) విండీస్‌ను దెబ్బతీశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని