సెరెనా పరాజయం

రిటైరవడానికి సిద్ధమవుతున్నానని ప్రకటించిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) పరాజయంపాలైంది. నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె 2-6,

Published : 12 Aug 2022 03:44 IST

టొరంటో: రిటైరవడానికి సిద్ధమవుతున్నానని ప్రకటించిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) పరాజయంపాలైంది. నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె 2-6, 4-6తో బెలిందా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడింది. తన వీడ్కోలుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని సెరెనా చెప్పిన సంగతి తెలిసిందే. తన చివరి ఈవెంట్‌ ఏదో సెరెనా చెప్పలేదు కానీ.. యుఎస్‌ ఓపెన్‌తో కెరీర్‌ను ముగిస్తుందని భావిస్తున్నారు. ఆమె వచ్చే వారం సిన్సినాటీ టోర్నీలో పోటీపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని