ఇంటర్నేషనల్‌ లీగ్‌లో పొలార్డ్‌, బ్రావో

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో ఆడుతున్న వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్లు కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో మరో లీగ్‌లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న

Published : 12 Aug 2022 03:45 IST

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో ఆడుతున్న వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్లు కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో మరో లీగ్‌లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20) ఆరంభ సీజన్‌లో ప్రధాన ఆటగాళ్లుగా వీళ్లు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీళ్లతో పాటు విండీస్‌ ప్రస్తుత కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌, శనక, ఓలీ పోప్‌, ఫరూఖీ, జోర్డాన్‌ థామ్సన్‌, కాట్రెల్‌, ఆండ్రూ ఫ్లెచర్‌ లాంటి ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడేందుకు ఒప్పుకున్నారు. ఈ లీగ్‌ ఆరంభ సీజన్‌ వచ్చే ఏడాది జనవరిలో ఆరంభమయ్యే అవకాశముంది. ఆరు జట్లు తలపడే ఈ లీగ్‌లో 34 మ్యాచ్‌లు దుబాయ్‌, అబుదాబి, షార్జాలో జరుగుతాయి. ఈ జట్లలో ఎక్కువ వాటిని ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలే సొంతం చేసుకోవడం విశేషం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కాప్రి గ్లోబల్‌, జీఎంఆర్‌, లాన్సర్‌ క్యాపిటల్‌, అదాని స్పోర్ట్స్‌లైన్‌లు ఫ్రాంఛైజీల యజమానులు.

‘‘ప్రపంచ టీ20 క్రికెట్లోని కొంత మంది పెద్ద ఆటగాళ్లు ఐఎల్‌టీ20లో ఆడతారని ఇటీవల ప్రకటించాం. ఇప్పుడా ప్రధాన ఆటగాళ్ల జాబితాలోకి పొలార్డ్‌, పూరన్‌, బ్రావో, శనక, పోప్‌ లాంటి ఆటగాళ్లు చేరారు. ఈ జాబితాలోని ప్రముఖ ఆటగాళ్ల సంఖ్య పెరగడం సంతోషాన్నిస్తోంది.  ప్రపంచ క్రికెట్లో అనుభవజ్ఞులైన ఈ ఆటగాళ్లతో కలిసి యువ క్రికెటర్లు ఆడుతుంటే చూసేందుకు ఉత్తేజితంగా ఉన్నాం’’ అని ఎమిరేట్స్‌ క్రికెట్‌ కార్యదర్శి ముబాషిర్‌ ఉస్మాని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని