Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్‌ తెందుల్కర్‌

సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ ముంబయిని వీడబోతున్నాడు. వచ్చే దేశవాళీ సీజన్‌ నుంచి గోవా  తరఫున ఆడబోతున్నాడు. అందుకోసం ముంబయి క్రికెట్‌ సంఘాన్ని నిరభ్యంతర పత్రం అడిగాడు. 22 ఏళ్ల ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌

Updated : 12 Aug 2022 08:01 IST

(Photo: Arjun Tendulkar Instagram)

దిల్లీ: సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ ముంబయిని వీడబోతున్నాడు. వచ్చే దేశవాళీ సీజన్‌ నుంచి గోవా  తరఫున ఆడబోతున్నాడు. అందుకోసం ముంబయి క్రికెట్‌ సంఘాన్ని నిరభ్యంతర పత్రం అడిగాడు. 22 ఏళ్ల ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ 2020-21 సీజన్లో ముస్తాక్‌ అలీ టోర్నీలో ముంబయికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో అతడు రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఉన్నా అరంగేట్రం చేయలేకపోయాడు. ‘‘అర్జున్‌ ప్రస్తుతం ఉన్న స్థితిలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ముంబయి నుంచి గోవాకు మారడం వల్ల అతడు వీలైనన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందని భావిస్తున్నాం’’ అని అర్జున్‌  ప్రతినిధి తెలిపాడు. గోవా క్రికెట్‌ సంఘం కూడా అర్జున్‌ ఆడే విషయాన్ని ఖరారు చేసింది. ‘‘లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేసే బౌలర్‌ కోసం చూస్తున్నాం. అంతేకాక మిడిలార్డర్‌లో ఆల్‌రౌండ్‌ సత్తా ఉన్న వాళ్ల కోసం వెతుకుతున్నాం. అందుకే అర్జున్‌ తెందుల్కర్‌ని మా జట్టులో చేరమని ఆహ్వానించాం. ముందుగా కొన్ని ట్రయల్‌ మ్యాచ్‌ల్లో అతణ్ని ఆడిస్తాం. ప్రదర్శనను బట్టి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు’’ అని గోవా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సూరజ్‌ లోట్లీకర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని