Published : 13 Aug 2022 03:07 IST

ఇక లక్ష్యం పారిస్‌ ఒలింపిక్స్‌

చెన్నై: కామన్వెల్త్‌ క్రీడల్లో సాధించిన పతకాలు తన స్ఫూర్తి స్థాయిని ఎంతో పెంచాయని, తర్వాత లక్ష్యం 2024 పారిస్‌ ఒలింపిక్సే అని భారత వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు ఆచంట శరత్‌కమల్‌ అన్నాడు. 40 ఏళ్ల శరత్‌ బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, పురుషుల టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో సత్యన్‌తో కలిసి రజతం సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆకుల శ్రీజతో కలిసి శరత్‌ పసిడి అందుకున్నాడు. ‘‘తర్వాత లక్ష్యం పారిస్‌ ఒలింపిక్సే. ఈసారి కామన్వెల్త్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగాను. ఎన్ని పతకాలు వస్తాయో ఊహించలేదు. అలాంటిది ఏకంగా మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు గెలవగలిగాను. ఈ పతకాలు నా స్ఫూర్తి స్థాయిని ఎంతో పెంచాయి. ఇక ఒలింపిక్స్‌పై దృష్టి సారిస్తా. కామన్వెల్త్‌కు ముందు రెండేళ్లు ఎంతో క్లిష్టంగా గడిచాయి. ఈ లేటు వయసులో ఇంకా ఏం చేయగలనన్న ఆలోచనలు వచ్చాయి. చీకటిలో కారు నడిపినట్లే అనిపించింది. మానసికంగా చాలా ఇబ్బందిపడ్డా. కానీ ఏ దశలోనూ స్థైర్యాన్ని కోల్పోలేదు. నాకున్న పరిమితుల్లో.. వనరులతోనే మళ్లీ పుంజుకున్నా. ఈ క్లిష్ట దశలో అండగా నిలిచిన సన్నిహితులందరికి ఎంతో కృతజ్ఞతలు’’ అని శరత్‌ చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని