జింబాబ్వే పర్యటనకు కోచ్‌గా లక్ష్మణ్‌

జాతీయ క్రికెట్‌ అకాడమీ అధినేత వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి టీమ్‌ఇండియాకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు జింబాబ్వేతో ఈ నెల 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌ ఆడబోతున్న భారత జట్టుకు అతను శిక్షకుడిగా వ్యవహరిస్తాడు

Published : 13 Aug 2022 03:07 IST

దిల్లీ: జాతీయ క్రికెట్‌ అకాడమీ అధినేత వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి టీమ్‌ఇండియాకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు జింబాబ్వేతో ఈ నెల 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌ ఆడబోతున్న భారత జట్టుకు అతను శిక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించాడు. ‘‘ప్రధాన కోచ్‌ ద్రవిడ్‌ విశ్రాంతి ఏమీ తీసుకోవట్లేదు. నెలాఖర్లో మొదలయ్యే ఆసియా కప్‌ కోసం అతను జట్టుతో కలిసి 23నే యూఏఈకి చేరుకోవాల్సి ఉంది. దీంతో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న మరో జట్టుకు లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆసియా కప్‌ జట్టులో ఉన్న ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ హుడా మాత్రమే జింబాబ్వేకు వెళ్తున్నారు. వాళ్లిద్దరూ పర్యటన ముగిశాక నేరుగా అక్కడి నుంచి యూఏఈకి చేరుకుంటారు’’ అని షా తెలిపాడు. లక్ష్మణ్‌ ఇంతకుముందు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడిన భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని