Published : 13 Aug 2022 03:07 IST

భారత్‌తో మ్యాచ్‌లో ఒత్తిడి సహజమే

కరాచి: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఈ రెండు దేశాలే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులూ ఎదురు చూస్తారు. మైదానంలో ఈ దాయాది దేశాలు పోటీపడుతుంటే ఆటకు మించిన భావోద్వేగాలు నెలకొంటాయి. అందుకే ఈ చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడెప్పుడు తలపడతాయా?   అనే ఆసక్తి ఉంటుంది. ఇక బయట భారీ అంచనాల దృష్ట్యా మైదానంలో దిగే ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల 27న ఆరంభమయ్యే ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు మూడు మ్యాచ్‌ల్లో తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తెలిపాడు. ‘‘సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడాలని ప్రయత్నిస్తాం. కచ్చితంగా ఆ ఒత్తిడి అనేది భిన్నంగా ఉంటుంది. కానీ 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడినట్లుగా కేవలం మా ధ్యాస ఆట మీదే పెడతాం. మా మీద, జట్టు మీద నమ్మకంతో ఉంటాం. ఈ సారి కూడా మా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ప్రయత్నమే మన చేతుల్లో ఉంటుంది ఫలితం కాదు’’ అని అతను పేర్కొన్నాడు. ఈ నెల 28న ఆసియా కప్‌లో పాక్‌ను భారత్‌ ఢీకొంటుంది. ఈ రెండు జట్లు సూపర్‌-4 దశకు చేరితే అక్కడ మరోసారి తలపడే అవకాశం ఉంది. ఫైనల్‌కు వెళ్తే మళ్లీ పోటీపడే ఆస్కారముంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts