ఖోఖో లీగ్‌కు రంగం సిద్ధం

దేశంలో మరో లీగ్‌కు వేళైంది. గ్రామీణ క్రీడ ఖోఖో సరికొత్త అవతారంలో అభిమానులను అలరించనుంది. స్థానిక శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌కు తెరలేస్తుంది. దేశంలో తొలిసారి ఫ్రాంఛైజీ పరంగా నిర్వహిస్తున్న ఖోఖో లీగ్‌ ఇదే.

Published : 13 Aug 2022 03:07 IST

పుణె: దేశంలో మరో లీగ్‌కు వేళైంది. గ్రామీణ క్రీడ ఖోఖో సరికొత్త అవతారంలో అభిమానులను అలరించనుంది. స్థానిక శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌కు తెరలేస్తుంది. దేశంలో తొలిసారి ఫ్రాంఛైజీ పరంగా నిర్వహిస్తున్న ఖోఖో లీగ్‌ ఇదే. చెన్నై క్విక్‌ గన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఖిలాడీస్‌, ఒడిషా జగర్‌నట్స్‌, రాజస్థాన్‌ వారియర్స్‌, తెలుగు యోధాస్‌.. ఇలా ఆరు జట్లు ఆరంభ సీజన్‌లో టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. తొలి రోజు మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబయి ఖిలాడీస్‌, రెండో మ్యాచ్‌లో చెన్నై క్విక్‌ గన్స్‌తో తెలుగు యోధాస్‌ తలపడతాయి. వచ్చే నెల 4 వరకు ఈ లీగ్‌ కొనసాగుతుంది. ‘‘ఈ లీగ్‌ ఆరంభం దేశంలో ఖోఖోకు ప్రత్యేకమైన సందర్భం. ప్రతి భారతీయుడి హృదయం, ఆత్మలో ఈ ఆట అంతర్గతంగా పాతుకుపోయింది. ప్రతి పాఠశాలలోనూ ఈ ఆట ఆడతారు. దీంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ మట్టిపై ఆటను సరికొత్త అవతారంలో ప్రపంచం ముందుకు తెస్తున్నందుకు గర్వపడుతున్నాం’’ అని లీగ్‌ కమిషనర్‌, సీఈవో తెంజింగ్‌ నియోగి పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని