క్వార్టర్స్‌లో అనాహత్‌

ప్రపంచ జూనియర్‌ మహిళల స్క్వాష్‌ టోర్నమెంట్లో భారత యువ తార అనాహత్‌ సింగ్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అనాహత్‌ 3-1తో టోరీ మాలిక్‌ (ఇంగ్లాండ్‌)ను ఓడించింది.

Published : 14 Aug 2022 03:56 IST

నాన్సీ (ఫ్రాన్స్‌): ప్రపంచ జూనియర్‌ మహిళల స్క్వాష్‌ టోర్నమెంట్లో భారత యువ తార అనాహత్‌ సింగ్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అనాహత్‌ 3-1తో టోరీ మాలిక్‌ (ఇంగ్లాండ్‌)ను ఓడించింది. సెమీఫైనల్లో స్థానం కోసం ఫరోజ్‌ (ఈజిప్ట్‌)తో ఆమె తలపడనుంది. ఇటీవల ముగిసిన బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ 14 ఏళ్ల అమ్మాయి పోటీపడింది. ఈ క్రీడల్లో భారత్‌ తరఫున బరిలో దిగిన పిన్న వయస్కురాలిగా అనాహత్‌ ఘనత సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని