బంగ్లా టీ20 కెప్టెన్‌గా షకీబ్‌

ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ శనివారం టీ20 జట్టుకూ సారథిగా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌, న్యూజిలాండ్‌లో ముక్కోణపు

Published : 14 Aug 2022 03:56 IST

ఢాకా: ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ శనివారం టీ20 జట్టుకూ సారథిగా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌, న్యూజిలాండ్‌లో ముక్కోణపు సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో తలపడే జట్టునూ అతను నడిపిస్తాడు. బెట్టింగ్‌ సంస్థతో ఒప్పందం కావాలో లేదా జాతీయ జట్టులో చోటు కావాలో తేల్చుకోవాలంటూ ఇటీవల షకీబ్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అతను ఆ ఒప్పందాన్ని వదులుకోవడంతో ఇప్పుడు జట్టు పగ్గాలు షకీబ్‌కు అందించారు. మరోవైపు ఈ నెల 27న యూఏఈలో ఆరంభమయ్యే ఆసియా కప్‌ కోసం 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీబీ ప్రకటించింది. 2019లో చివరగా టీ20 ఆడిన షబ్బీర్‌ రెహ్మాన్‌కు చోటు దక్కింది.

బంగ్లాదేశ్‌ జట్టు: షకీబ్‌ (కెప్టెన్‌), అనముల్‌ హక్‌, ముష్ఫికర్‌, అఫిఫ్‌, మొసాదెక్‌, మహ్మదుల్లా, మెహదీ హసన్‌, సైఫుద్దీన్‌, హసన్‌, ముస్తాఫిజుర్‌, నసుమ్‌ అహ్మద్‌, ష£బ్బీర్‌ రెహ్మాన్‌, హసన్‌, ఎబాదత్‌, పర్వేజ్‌, నురుల్‌ హసన్‌, తస్కిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని