షమి కంటే మెరుగైన పేసర్లున్నారు

ఆసియా కప్‌లో పోటీపడే భారత జట్టులో పేసర్‌ మహ్మద్‌ షమికి చోటు లభించకపోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ సమర్థించాడు. అతడి కంటే నాణ్యమైన టీ20 బౌలర్లు భారత్‌లో ఉన్నారని అన్నాడు.

Published : 14 Aug 2022 03:57 IST

దుబాయ్‌: ఆసియా కప్‌లో పోటీపడే భారత జట్టులో పేసర్‌ మహ్మద్‌ షమికి చోటు లభించకపోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ సమర్థించాడు. అతడి కంటే నాణ్యమైన టీ20 బౌలర్లు భారత్‌లో ఉన్నారని అన్నాడు. ‘‘షమి నిస్సందేహంగా టీమ్‌ఇండియా ఉత్తమ బౌలర్లలో ఒకడు. చాలా ఏళ్లుగా అతడు ఆడుతున్నాడు. బౌలింగ్‌లో బలాబలాలను పరిశీలిస్తే షమి టెస్టు క్రికెట్‌కు సరిగ్గా సరిపోతాడని అర్థమవుతుంది. టీ20 క్రికెట్‌ కోసం భారత్‌లో అతడి కంటే నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. అందులో ముగ్గురిని మాత్రమే ఆసియా కప్‌ కోసం ఎంపిక చేశారు. జట్టులో నలుగురు పేసర్లను ఎంపికచేసివుంటే షమికి చోటు దక్కేదేమో’’ అని రికీ చెప్పాడు. దుబాయ్‌, షార్జాలో జరిగే ఆసియా కప్‌ కోసం ప్రకటించిన టీమ్‌ఇండియాలో భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు చోటు లభించింది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ నలుగురు ఫాస్ట్‌బౌలర్లను ఎంపిక చేసే అవకాశముందని పాంటింగ్‌ అన్నాడు. ఆగస్టు 27న ఆరంభమయ్యే ఆసియా కప్‌లో భారత జట్టే ఫేవరెట్‌ అని రికీ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని