Ricky Ponting: సూర్య.. ఏబీ డివిలియర్స్‌ లాంటోడు: పాంటింగ్‌

భారత డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఏబీ డివిలియర్స్‌ లాంటోడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఏబీలాగే సూర్య కూడా 360 డిగ్రీల ఆటగాడని  కితాబిచ్చాడు. ‘‘దక్షిణాఫ్రికా స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ మాదిరే సూర్యకుమార్‌

Updated : 16 Aug 2022 09:01 IST

దుబాయ్‌: భారత డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఏబీ డివిలియర్స్‌ లాంటోడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఏబీలాగే సూర్య కూడా 360 డిగ్రీల ఆటగాడని  కితాబిచ్చాడు. ‘‘దక్షిణాఫ్రికా స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ మాదిరే సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా 360 డిగ్రీల్లో షాట్లు ఆడతాడు. ఏబీ ఆడినట్లే కూడా ల్యాప్‌ షాట్స్‌, లేట్‌ కట్స్‌, ర్యాంప్‌ షాట్లు ఆడుతున్నాడు. ముఖ్యంగా లెగ్‌సైడ్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ మీదుగా అతడు కొట్టే ఫ్లిక్‌ షాట్లు అద్భుతం. మూడో స్థానంలో విరాట్‌ కోహ్లి ఉన్నందున సూర్యను నాలుగో స్థానంలో దించితే మంచిది’’ అని పాంటింగ్‌ అన్నాడు.


కెనడియన్‌ టైటిల్‌ హలెప్‌ సొంతం

టొరంటో: రొమేనియా స్టార్‌ సిమోనా హలెప్‌ సత్తా చాటింది. ఫామ్‌ కొనసాగిస్తూ కెనడియన్‌ ఓపెన్లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో హలెప్‌ 6-3, 2-6, 6-3తో బెయాట్రిజ్‌ హడాడ్‌ (బ్రెజిల్‌)ను ఓడించింది. తొలి సెట్‌ సులభంగానే గెలిచిన హలెప్‌ రెండో సెట్లో తడబడింది. వరుస తప్పిదాలతో సెట్‌ను చేజార్చుకుంది. కానీ మూడో సెట్లో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని