వ్యాఖ్యానానికి చాపెల్‌ గుడ్‌బై

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యానానికి వీడ్కోలు పలికాడు. వ్యాఖ్యాతగా 45 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. ఇయాన్‌ చాపెల్‌, రిచీ బెనాడ్‌, బిల్‌ లారీ, టోని గ్రెయిగ్‌లతో కూడిన దిగ్గజ బృందం ఛానెల్‌ 9కు విశిష్ట సేవలందించింది.

Published : 16 Aug 2022 02:49 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యానానికి వీడ్కోలు పలికాడు. వ్యాఖ్యాతగా 45 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. ఇయాన్‌ చాపెల్‌, రిచీ బెనాడ్‌, బిల్‌ లారీ, టోని గ్రెయిగ్‌లతో కూడిన దిగ్గజ బృందం ఛానెల్‌ 9కు విశిష్ట సేవలందించింది. 2019లో చర్మ క్యాన్సర్‌ బారిన పడిన 78 ఏళ్ల చాపెల్‌.. అయిదు వారాల చికిత్స అనంతరం కోలుకున్నాడు. ‘‘వ్యాఖ్యానం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కొన్నేళ్ల క్రితం స్వల్పంగా గుండె పోటు వచ్చింది. అదృష్టం కొద్దీ బయటపడ్డా. ఆ తర్వాత జీవితం చాలా క్లిష్టంగా అనిపించింది’’ అని ఇయాన్‌ అన్నాడు. 1964-1980 కాలంలో ఆసీస్‌ తరఫున 75 టెస్టులు ఆడిన చాపెల్‌.. 5345 పరుగులు సాధించాడు. 30 టెస్టులకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1971-80 మధ్య ఇయాన్‌ 16 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికి మైక్రోఫోన్‌ అందుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని