రోహిత్‌ను దాటేసిన గప్తిల్‌

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్తిల్‌.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. విండీస్‌తో మూడో టీ20లో 15 పరుగులు చేసిన అతడు.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించాడు. గప్తిల్‌ ఇప్పటివరకు

Published : 16 Aug 2022 02:49 IST

కింగ్‌స్టన్‌: న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్తిల్‌.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. విండీస్‌తో మూడో టీ20లో 15 పరుగులు చేసిన అతడు.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించాడు. గప్తిల్‌ ఇప్పటివరకు 121 టీ20ల్లో 31.79 సగటుతో 3497 పరుగులు చేశాడు. రోహిత్‌ (32.28 సగటుతో 3,487) జులైలోనే గప్తిల్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరయ్యాడు. కోహ్లి (50.12 సగటుతో 3,308) మూడో స్థానంలో ఉన్నాడు.

మూడో టీ20లో విండీస్‌ విజయం: ముందే సిరీస్‌ చేజార్చుకున్న వెస్టిండీస్‌ చివరిదైన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మొదట కివీస్‌ 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఒడియన్‌ స్మిత్‌ (3/29), హొసీన్‌ (2/28), డ్రేక్స్‌ (1/19) ఆ జట్టుకు కళ్లెం వేశారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (41) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు బ్రూక్స్‌ (56 నాటౌట్‌), బ్రెండన్‌ కింగ్‌ (53) మెరవడంతో లక్ష్యాన్ని విండీస్‌ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్‌తో తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించి బలమైన ఆరంభాన్నిచ్చిన బ్రూక్స్‌.. రోమన్‌ పావెల్‌ (27 నాటౌట్‌)తో అభేద్యమైన మూడో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-1తో గెలుచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని