సెరెనా.. గొప్ప స్ఫూర్తి ప్రదాత

అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ అన్నాడు. ఈ ఏడాది యుఎస్‌ ఓపెన్‌ తర్వాత సెరెనా వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు.

Published : 16 Aug 2022 02:49 IST

మాడ్రిడ్‌: అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ అన్నాడు. ఈ ఏడాది యుఎస్‌ ఓపెన్‌ తర్వాత సెరెనా వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘టెన్నిస్‌ను సెరెనా వీడడం బాధ కలిగిస్తోంది. అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు. విలియమ్స్‌తో కలిసి నేనూ టెన్నిస్‌ ప్రయాణాన్ని సాగించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె అందరికి గొప్ప స్ఫూర్తి ప్రదాత. రిటైర్‌ అయ్యాక తనకు నచ్చింది ఎంచుకునే హక్కు సెరెనాకు ఉంది. విలియమ్స్‌కు అభినందనలు’’ అని నాదల్‌ పేర్కొన్నాడు. రికార్డు స్థాయిలో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన సెరెనా.. చివరిగా 2017లో (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) టైటిల్‌ సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని