మూడేళ్లలో అమ్మాయిలకు 65 మ్యాచ్‌లు

రానున్న మూడేళ్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తొలిసారిగా మహిళల క్రికెట్లో రూపొందించిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) 2022-2025 చక్రాన్ని మంగళవారం ఐసీసీ ప్రకటించింది.

Published : 17 Aug 2022 06:22 IST

దుబాయ్‌: రానున్న మూడేళ్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తొలిసారిగా మహిళల క్రికెట్లో రూపొందించిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) 2022-2025 చక్రాన్ని మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ మూడేళ్ల ఎఫ్‌టీపీలో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20లతో కలిపి మొత్తం 301 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్‌ 2 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలతో ఒక్కో టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది. 2022 మే నెల నుంచి కొత్త ఎఫ్‌టీపీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత అమ్మాయిలు ఇప్పటికే శ్రీలంకతో మూడేసి వన్డేలు, టీ20లు ఆడేశారు. ఎఫ్‌టీపీ ప్రకారం సొంతగడ్డపై న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లతో భారత్‌ తలపడనుంది. ఆసీస్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక (ఇప్పటికే ఆడేసింది), బంగ్లాదేశ్‌లతో ప్రత్యర్థి జట్ల వేదికల్లో పోటీపడుతుంది. ఇక ఎఫ్‌టీపీలోని ఏడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ అత్యధికంగా అయిదు, ఆసీస్‌ నాలుగు, దక్షిణాఫ్రికా మూడు, టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు