ఐఓఏకు పరిపాలకుల కమిటీ

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) వ్యవహరాలు చూసుకునేందుకు దిల్లీ హైకోర్టు మంగళవారం ముగ్గురు సభ్యుల పాలకుల కమిటీ (సీఓఏ)ని నియమించింది.

Published : 17 Aug 2022 03:13 IST

దిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) వ్యవహరాలు చూసుకునేందుకు దిల్లీ హైకోర్టు మంగళవారం ముగ్గురు సభ్యుల పాలకుల కమిటీ (సీఓఏ)ని నియమించింది. క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవడానికి ఐఓఏ నిరాకరిస్తున్న కారణంగా సంఘం వ్యవహరాలను సీఓఏకు అప్పగించక తప్పట్లేదని జస్టిన్‌ మన్మోహన్‌, జస్టిన్‌ నజ్మి వజిరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అనిల్‌ దవె, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఖురేషి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌లు సీఓఎలో సభ్యులు. ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించాలని ఐఓఏ కార్యనిర్వాహక వర్గాన్ని కోర్టు ఆదేశించింది. షూటర్‌ అభినవ్‌ బింద్రా, లాంగ్‌ జంప్‌ ఒలింపియన్‌ అంజు బాబి జార్జ్‌, ఆర్చర్‌ ఒలింపియన్‌ బాంబేలా దేవి ఈ కమిటీకి సహకరిస్తారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని