ప్రజ్ఞానంద శుభారంభం

అమెరికా ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రజ్ఞానంద 2.5-1.5తో జూనియర్‌ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారుడు అలీ రెజా ఫిరోజియాపై గెలిచాడు.

Published : 17 Aug 2022 03:13 IST

మియామి: అమెరికా ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రజ్ఞానంద 2.5-1.5తో జూనియర్‌ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారుడు అలీ రెజా ఫిరోజియాపై గెలిచాడు. నాలుగు గేమ్‌ల తొలి రౌండ్లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద.. తొలి గేమ్‌లో గెలిచి రెండో గేమ్‌ను చేజార్చుకున్నాడు. మూడో గేమ్‌లో పాయింట్లు పంచుకున్న ప్రజ్ఞానంద.. నాలుగో గేమ్‌లో అలీ రెజాపై పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీలో ప్రతి రౌండ్లో నాలుగు ర్యాపిడ్‌ గేమ్స్‌ ఆడతారు. నాలుగు గేమ్‌ల తర్వాత 2-2తో డ్రా అయితే బ్లిట్జ్‌ టైబ్రేక్‌ను నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని