ఇంగ్లాండ్‌ 116/6

ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టును దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. వర్షం కారణంగా చాలా ఆట వృథా అయినా, తొలి రోజు పైచేయి సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. నోకియా (3/43), రబాడ (2/36) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో

Published : 18 Aug 2022 02:20 IST

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు 

లార్డ్స్‌: ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టును దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. వర్షం కారణంగా చాలా ఆట వృథా అయినా, తొలి రోజు పైచేయి సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. నోకియా (3/43), రబాడ (2/36) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఒలీ పోప్‌ (61 బ్యాటింగ్‌) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడు స్టోక్స్‌ (20)తో అయిదో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. పోప్‌కు తోడుగా స్టువర్ట్‌ బ్రాడ్‌ (0) క్రీజులో ఉన్నాడు. వర్షం వల్ల బుధవారం 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని