సెరెనా మరో ఓటమి

రిటైర్మెంట్‌ దిశగా సాగుతున్న టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మరో టోర్నీ నుంచి ఓటమితో నిష్క్రమించింది. తన కెరీర్‌లో చివరిసారిగా వెస్టర్న్, సౌథర్న్‌ ఓపెన్‌ (సిన్సినాటి టోర్నీ)లో బరిలో దిగిన ఈ 40 ఏళ్ల మాజీ నంబర్‌వన్‌ మహిళల

Published : 18 Aug 2022 02:21 IST

మేసన్‌: రిటైర్మెంట్‌ దిశగా సాగుతున్న టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మరో టోర్నీ నుంచి ఓటమితో నిష్క్రమించింది. తన కెరీర్‌లో చివరిసారిగా వెస్టర్న్, సౌథర్న్‌ ఓపెన్‌ (సిన్సినాటి టోర్నీ)లో బరిలో దిగిన ఈ 40 ఏళ్ల మాజీ నంబర్‌వన్‌ మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ఈ అమెరికా క్రీడాకారిణి 4-6, 0-6 తేడాతో యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ ఎమ్మా రదుకాను (బ్రిటన్‌) చేతిలో ఓడింది. 19 ఏళ్ల ప్రత్యర్థితో పోరులో తొలి సెట్లో కాస్త పోరాడిన సెరెనా.. రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ నెల 29న ఆరంభమయ్యే యుఎస్‌ ఓపెన్‌తో ఆమె ఆటకు వీడ్కోలు పలుకుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒసాక (జపాన్‌) 4-6, 5-7తో షువాయి జంగ్‌ (చైనా) చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. కోకో గాఫ్‌ (అమెరికా) గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలో తప్పుకుంది. ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7-5, 6-1తో వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌ (రష్యా) మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు రెండో రౌండ్లో 6-4, 7-5తో బోటిచ్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని