మాంచెస్టర్‌ యునైటెడ్‌తో మస్క్‌ జోక్‌

ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్‌ మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ ఫుట్‌బాల్‌ అభిమానుల్లో కాస్త గందరగోళాన్ని సృష్టించింది. ప్రముఖ ఇంగ్లిష్‌ సాకర్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నానని

Published : 18 Aug 2022 02:22 IST

లండన్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్‌ మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ ఫుట్‌బాల్‌ అభిమానుల్లో కాస్త గందరగోళాన్ని సృష్టించింది. ప్రముఖ ఇంగ్లిష్‌ సాకర్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నానని అతను బుధవారం ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. పేలవ ప్రదర్శనతో సాగుతున్న ఆ జట్టును టెస్లా సీఈవో మస్క్‌ సొంతం చేసుకుంటే క్లబ్‌కు మంచిదని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ నిజంగానే క్లబ్‌ను కొంటున్నారా? అని ఓ వ్యక్తి అడగ్గా జోక్‌ చేశానని మస్క్‌ సమాధానమిచ్చాడు. ‘‘లేదు.. ఇది ట్విటర్‌లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న జోక్‌. ఏ క్రీడా జట్టునూ నేను కొనుగోలు చేయడం లేదు’’ అని అతను మరో ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని చెప్పి వెనక్కి తగ్గిన అతను అందుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు అలెక్స్‌ ఫెర్గూసన్‌ శిక్షణలో 13 ప్రీమియర్‌ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్‌ లీగ్‌ ట్రోఫీలు సొంతం చేసుకున్న ఆ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. తాజాగా ప్రీమియర్‌ లీగ్‌లో చిన్న జట్టు బ్రెంట్‌ఫోర్డ్‌ చేతిలో 0-4 తేడాతో ఓడింది. దీంతో ఆ జట్టు యాజమాన్యంపై అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని