రాహుల్‌ పసిడి గురి

ప్రపంచ పారా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాహుల్‌ జక్కర్‌ మెరిశాడు. గురువారం 25 మీటర్ల మిక్స్‌డ్‌ పిస్టల్‌ షూటింగ్‌లో అతడు స్వర్ణం సాధించాడు. క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుది పోరుకు చేరిన రాహుల్‌..

Published : 19 Aug 2022 02:35 IST

చాంగ్‌వాన్‌: ప్రపంచ పారా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాహుల్‌ జక్కర్‌ మెరిశాడు. గురువారం 25 మీటర్ల మిక్స్‌డ్‌ పిస్టల్‌ షూటింగ్‌లో అతడు స్వర్ణం సాధించాడు. క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుది పోరుకు చేరిన రాహుల్‌.. షూటాఫ్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఆరంభ రౌండ్లలో ప్రత్యర్థి కిమ్‌ కన్నా రాహుల్‌ వెనుకబడ్డాడు. అయితే చివర్లో పుంజుకుని ప్రత్యర్థితో సమానంగా నిలిచిన రాహుల్‌.. షూటాఫ్‌లోనూ గట్టిపోటీ ఎదురైనా నిలిచి గెలిచాడు. ఇదే విభాగంలో పూజ అగర్వాల్‌ కాంస్యం నెగ్గింది. పారాలింపిక్‌ ఛాంపియన్‌ అవని వీల్‌ఛైర్‌ రైఫిల్‌ విభాగంలో రజతం సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు