పట్టుబిగిస్తోన్న దక్షిణాఫ్రికా

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. సరెల్‌ ఇర్వీ (73) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు ఎల్గర్‌ (47)తో మొదటి వికెట్‌కు 85, పీటర్సన్‌ (24)తో రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు.

Published : 19 Aug 2022 02:35 IST

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు

లార్డ్స్‌: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. సరెల్‌ ఇర్వీ (73) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు ఎల్గర్‌ (47)తో మొదటి వికెట్‌కు 85, పీటర్సన్‌ (24)తో రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. జాన్సన్‌ (41 బ్యాటింగ్‌), మహరాజ్‌ (41) ఏడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  దక్షిణాఫ్రికా 124 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 116/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ 165 పరుగులకు ఆలౌటైంది. రబాడ 5 వికెట్లు పడగొట్టాడు.

ఐర్లాండ్‌దే టీ20 సిరీస్‌
బెల్‌ఫాస్ట్‌: అఫ్గానిస్థాన్‌తో అయిదు టీ20ల సిరీస్‌ను ఐర్లాండ్‌ 3-2తో చేజిక్కించుకుంది. చివరి టీ20లో ఆ జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించగా.. మొదట అఫ్గాన్‌ 5 వికెట్లకు 95 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఘని (44 నాటౌట్‌) రాణించాడు. అడైర్‌ (3/16), లిటిల్‌ (2/14) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందే మళ్లీ వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 7 ఓవర్లలో 56 పరుగులుగా సవరించారు. ఛేదనలో ఐర్లాండ్‌ 6.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఐర్లాండ్‌ గెలవగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లను అఫ్గాన్‌ దక్కించుకుని సిరీస్‌ సమం చేసింది.

వెస్టిండీస్‌ బోణీ
బ్రిడ్జ్‌టౌన్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య వెస్టిండీస్‌.. వన్డేల్లో బోణీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 45.2 ఓవర్లలో 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (34), బ్రాస్‌వెల్‌ (31) రాణించారు. అకీల్‌ (3/28), జోసెఫ్‌ (3/36), హోల్డర్‌ (2/39) ప్రత్యర్థిని కట్టడి చేశారు. లక్ష్యాన్ని విండీస్‌ 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. బ్రూక్స్‌ (79) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్‌ పూరన్‌ (28), హోప్‌ (26) రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బౌల్ట్‌, సౌథీ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని