ఐఓఏకు ఊరట

భారత ఒలింపిక్‌ సంఘానికి తాత్కాలిక ఉపశమనం. ఐఓఏకు ముగ్గురు సభ్యుల పాలకుల కమిటీ (సీఓఏ)ని నియమిస్తూ దిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. సీఓఏ లాంటి వ్యవస్థని

Published : 19 Aug 2022 02:35 IST

దిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘానికి తాత్కాలిక ఉపశమనం. ఐఓఏకు ముగ్గురు సభ్యుల పాలకుల కమిటీ (సీఓఏ)ని నియమిస్తూ దిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. సీఓఏ లాంటి వ్యవస్థని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) గుర్తించదని, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనకుండా భారత్‌పై నిషేధం పడే అవకాశముందని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదనలను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సీటీ రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సీఓఏకు ఐఓఏ బాధ్యతలు అప్పగించరాదని స్పష్టం చేసింది. ప్రతి దేశం కూడా అంతర్జాతీయ సమాఖ్యల నిబంధనలకు కట్టుబడి ఉండాలని మెహతా కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణ సోమవారం జరగనుంది. దిల్లీ హైకోర్టు మంగళవారం భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)కు పాలకుల కమిటీని నియమించింది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవడానికి ఐఓఏ తిరస్కరిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొంది. పాలనా బాధ్యతలను వెంటనే సీఓఏకు అప్పగించాలని ఐఓఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఆదేశించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని