ఫుట్‌బాల్‌ ఎన్నికల బరిలోకి భుటియా

భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భుటియా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎన్నికల బరిలో నిలిచాడు. అతను సమాఖ్య అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. భుటియాకు ఆటగాడిగా గొప్ప పేరున్నప్పటికీ.. ఏఐఎఫ్‌ఎఫ్‌లో రాజకీయాలు, పోటీని తట్టుకుని అధ్యక్షుడిగా గెలవడం అంత తేలిక

Published : 20 Aug 2022 02:33 IST

దిల్లీ: భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భుటియా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎన్నికల బరిలో నిలిచాడు. అతను సమాఖ్య అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. భుటియాకు ఆటగాడిగా గొప్ప పేరున్నప్పటికీ.. ఏఐఎఫ్‌ఎఫ్‌లో రాజకీయాలు, పోటీని తట్టుకుని అధ్యక్షుడిగా గెలవడం అంత తేలిక కాదు. ఈ పదవికి తీవ్ర స్థాయిలోనే పోటీ నెలకొంది. నామినేషన్లకు చివరి రోజైన శుక్రవారమే అతను ఆ ప్రక్రియ పూర్తి చేశాడు. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని