రోహిత్‌ ఎదుర్కొన్న సవాళ్లెన్నో

టెస్టుల్లో కుదురుకునేందుకు రోహిత్‌శర్మ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడని భారత జట్టు సహచరుడు దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ‘‘టెస్టు క్రికెట్లో తన వంతు పాత్ర  పోషించాలని రోహిత్‌ ఎప్పుడూ అనుకునేవాడు. నాతో మాట్లాడిన ప్రతిసారి కొన్ని విషయాలు కలిసి రావట్లేదని అనేవాడు. ఒక్కోసారి అతడు చెత్త షాట్లు ఆడి ఔటయ్యేవాడు. కానీ పుంజుకుంటానన్న

Published : 20 Aug 2022 02:33 IST

ముంబయి: టెస్టుల్లో కుదురుకునేందుకు రోహిత్‌శర్మ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడని భారత జట్టు సహచరుడు దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ‘‘టెస్టు క్రికెట్లో తన వంతు పాత్ర  పోషించాలని రోహిత్‌ ఎప్పుడూ అనుకునేవాడు. నాతో మాట్లాడిన ప్రతిసారి కొన్ని విషయాలు కలిసి రావట్లేదని అనేవాడు. ఒక్కోసారి అతడు చెత్త షాట్లు ఆడి ఔటయ్యేవాడు. కానీ పుంజుకుంటానన్న నమ్మకాన్ని కోల్పోయేవాడు కాదు. తన తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌ సెంచరీలు బాదాడు. సచిన్‌ రిటైర్‌ అయిన తర్వాత టెస్టు క్రికెట్లో అతడిలా మిడిలార్డర్‌లో రాణించే సత్తా ఉన్న ఆటగాడు ఇతనే అని అభిమానులు అనుకున్నారు. వరుస వైఫల్యాలు వెంటాడాయి. కానీ రోహిత్‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలిచాడు’’ అని దినేశ్‌ గుర్తు చేసుకున్నాడు. 2013లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోహిత్‌.. మిడిలార్డర్‌లో దిగి వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదాడు. కానీ ఆ తర్వాత విఫలమయ్యాడు. 2019లో ఓపెనర్‌గా అవతారం ఎత్తిన నాటి నుంచి రోహిత్‌ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ స్థానంలో స్థిరపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు