Hardik pandya: బుమ్రాకు చాలినంత సమయమివ్వాలి: హార్దిక్‌ పాండ్య

బుమ్రాపై జట్టు మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టబోదని స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన బుమ్రాకు తగినంత సమయం ఇస్తామని చెప్పాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో బుమ్రా ఆడని సంగతి తెలిసిందే. ‘‘బుమ్రా జట్టుకు ఎంత ముఖ్యమో

Updated : 22 Sep 2022 09:21 IST

మొహాలి: బుమ్రాపై జట్టు మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టబోదని స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన బుమ్రాకు తగినంత సమయం ఇస్తామని చెప్పాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో బుమ్రా ఆడని సంగతి తెలిసిందే. ‘‘బుమ్రా జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బౌలింగ్‌పై కాస్త ఆందోళన ఉండొచ్చు. కానీ మేం మా కుర్రాళ్లను నమ్మాలి. ఈ 15 మంది దేశంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. అందుకే జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం లోటే. అతడు చాలా ప్రభావం చూపిస్తాడు. అయితే గాయం నుంచి కోలుకుని వచ్చిన అతడికి పునరాగమనానికి తగినంత సమయం ఇవ్వాలి. అతడిపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు’’ అని హార్దిక్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని